బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanmanthrao), ఆయన కుమారుడు రోహిత్ (Mynampalli Rohith) ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. మైనంపల్లికి మల్కాజ్ గిరి టికెట్ పై హమీ లభించగా.. రోహిత్ కు మెదక్ టికెట్ కన్ఫామ్ అయినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ పని చేసుకున్న వారు భగ్గుమంటున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడ్డ తమను పక్కకుపెట్టి కొత్తగా వచ్చిన వారికి అవకాశం కల్పించడం ఏంటని ఆశిస్తున్నారు.
Mynampalli: మైనంపల్లి చేరికతో కాంగ్రెస్ లో చిచ్చు.. కీలక నేత ఔట్!
మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ ను మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ కు ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కష్టపడి పని చేసిన వారికి పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Translate this News:











