అభివృద్ధి పేరుతో కేసీఆర్ దోపిడీకి తెరలేపారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన.. ప్రభుత్వ మాస్టర్ ప్లాన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ పేదల భూములను లాక్కోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పేదల భూములు ఏ విధంగా లాక్కోవాలని అలోచించిన కేసీఆర్ నిర్మల్లో కొత్త మాస్టర్ ప్లాన్ అంటూ భూములను లాక్కుంటున్నారన్నారు.
పూర్తిగా చదవండి..Etala Rajender: మాస్టర్ ప్లాన్ రైతులపాలిట శాపంగా మారింది
ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ పేరుతో రైతుల భూమి లాక్కుంటే వారు ఎలా జీవనం సాగిస్తారని ప్రశ్నించారు.

Translate this News:











