సాహితీ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
అచ్యుతాపురం ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాహితీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీలో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.












