Medigadda Lakshmi Barrage: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు 30 మీటర్లు కుంగిపోవడానికి కారణం నాణ్యతా లోపమేనని మావోయిస్టులు(Maoist) పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) కుంగిన సంఘటనపై సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మావోయిస్టు జేఎమ్డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో శుక్రవారం లేఖ విడుదలైంది. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారని అన్నారు. 2016 మే 2న నిర్మాణం మొదలుపెట్టి, 2019 జూన్ 21న ప్రారంభించారన్నారు. అయితే మూడు సంవత్సరాల్లోనే ప్రాజెక్టు దెబ్బతిందని తెలిపారు.
పూర్తిగా చదవండి..Kaleshwaram Project: ‘మేడిగడ్డ’ ఘటనపై మావోయిస్టుల లేఖ.. సీఎం కేసీఆర్పై సీరియస్..
మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై మావోయిస్టులు తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ లేఖ విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కేసీఆర్ కుటుంబమే కారణమని ఆరోపించారు. పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుని నాసిరకంగా నిర్మించారన్నారు. నిర్మాణ సమయంలోనే పగుళ్లు ఏర్పడినా, బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదన్నారు. ప్రజలను, ప్రజాసంఘాలను కూడా అడ్డుకున్నారని అన్నారు.

Translate this News:











