తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల (TS Elections 2023) వేడి తారా స్థాయికి వేళ మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజన్ కమిటీ (BKSR) కార్యదర్శి ఆజాద్ పేరిట మావోయిస్టు పార్టీ ఈ లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar), మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని (Ponguleti Srinivas Reddy) టార్గెట్ చేసింది మావోయిస్టు పార్టీ. ఈ ఇద్దరు నాయకులు కూడా కార్పొరేట్ రాజకీయ నాయకులేనంటూ ధ్వజమెత్తింది. వీరిలో ఎవరిని గెలిపించినా.. వారి స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తారు కానీ.. ప్రజల కోసం కాదని పేర్కొంది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) పొంగులేటి చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని లేఖలో ధ్వజమెత్తారు ఆజాద్ (Azad). పొంగులేటి ఒక్కో నియోజకవర్గానికి రూ.40 కోట్లు, జిల్లా మొత్తం రూ.400 కోట్లు ఖర్చు చేస్తానని అధిష్టానానికి ఆశ చూపుతున్నాడని ఆరోపించారు.
ఇది కూడా చూడండి: TS Congress: కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల ఎప్పుడంటే?
Maoist Letter: టార్గెట్ పొంగులేటి, పువ్వాడ.. ఎన్నికల వేళ మావోయిస్టుల సంచలన లేఖ!
ఖమ్మం జిల్లాకు చెందిన కీలక రాజకీయ నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ టార్గెట్ గా మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. ఈ ఇద్దరు నేతలు జిల్లాను తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. వీరి గెలుపుతో వారి ప్రయోజనాలు నెరవేరుతాయి కానీ.. ప్రజలకు ఎలాంటి లాభం ఉండదని లేఖలో పేర్కొంది మావోయిస్టు పార్టీ. ఈ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చింది.

Translate this News:











