Maoist Party Letter : ప్రజాగాయకుడు గద్దర్ మృతిపై భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) స్పందించింది. గద్దర్ మృతి తమను తీవ్రంగా కలచివేసిందని ప్రకటన విడుదల చేసింది. గద్దర్ అంటే దేశంలో, రాష్ట్రంలో తెలియని వారు వుండరని పేర్కొంది. గద్దర్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపింది. నగ్జల్బరి, శ్రీకాకులం పోరాటాల ప్రేరణతో తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారంది. పాటలు, నాటికలు, బుర్ర కథలు, ఒగ్గు కథల ద్వారా పీడిత ప్రజలను చైతన్యపరిచారని చెప్పింది. జన నాట్య మండలి ఏర్పాటులో గద్దర్ కృషి ఉందంది.1972 నుంచి గద్దర్ విప్లవ ప్రస్థానం మొదలై 2012 వరకు కొనసాగిందని వెల్లడించింది. నాలుగు దశబ్దాల పాటు పీడిత ప్రజల ప్రక్షాన నిలబడ్డారంది.
పూర్తిగా చదవండి..గద్దర్ మరణం తీవ్రంగా కలిచివేసింది.. మావోయిస్ట్ పార్టీ లేఖ

Translate this News:












