Holiday for schools: హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా వరుణుడు వీరవిహారం చేస్తుండడంతో పలు స్కూల్స్(schools) కీలక నిర్ణయం తీసుకున్నాయి. స్కూల్స్‌కి రావద్దని మెసేజీలు పెడుతున్నాయి. తెల్లవారుజామున నుంచే వాన దంచికొడుతుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు దాపరించాయి. ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లడానికి నిద్రలేచిన విద్యార్థులు.. వారిని రెడీ చేయడానికి సిద్ధమైన తల్లిదండ్రులు బయట కురుస్తోన్న వర్షం చూసి షాక్ అయ్యారు. ఇవాళ స్కూల్ ఉండదులే అని భావించారు. కొన్ని స్కూల్స్ యాజమాన్యాలు అప్పటికే ‘వర్షం వల్ల స్కూల్‌కి హాలీడే’ అని మెసేజులు పంపగా.. మిగిలిన స్కూల్స్ మాత్రం చోద్యం చూస్తున్నాయి. నగరంలో ఉదయం నాలుగు గంటల నుంచే వాన కమ్మేస్తున్నా.. అది సాయంత్రం వరకు ఇలానే ఉంటుందని హెచ్చరికలు ఉన్నా హాలీడే ప్రకటించకుండా తల్లిదండ్రులను టెన్షన్ పెడుతున్నాయి. చాలా స్కూల్స్ మాత్రం బాధ్యతవహించి ముందుగానే సెలవు ప్రకటించాయి.
పూర్తిగా చదవండి..Telangana Rains: విద్యార్థులకు అలెర్ట్.. స్కూల్‌కి సెలవు ప్రకటన.. రెయిన్ ఎఫెక్ట్!
హైదరాబాద్‌లో వర్షం నాన్‌స్టాప్‌గా దంచికొడుతుండడంతో పలు స్కూల్స్ హాలీడే ప్రకటించాయి. స్కూల్‌కి ఇవాళ రావొద్దని తల్లిదండ్రులకు మెసేజీలు పెడుతున్నాయి. అటు జీహెచ్ఎంసీ అధికారులు సైతం అత్యవసరం అయితే తప్ప బయటకు రావోద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Translate this News:











