
సోషల్‌మీడియా(social media)లో నిత్యం ఫేక్‌న్యూస్(fake news)లే దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా మతాలు, కులాలు, పార్టీల ప్రాపగండాలో మునిగిపోయి ఉన్న కొంతమంది యూజర్లు..వాళ్ల కోసం పని చేసే వింగ్‌లు అసత్యాలను వీర లెవల్లో వ్యాప్తి చేస్తుంటాయి. సంబంధిత వింగ్‌లకు ఆ విషయం తెలిసినా.. నెటిజన్లు మాత్రం వాటిని ఎడాపెడా షేర్లు చేసి పడేస్తుంటారు. వార్త వాళ్లకి అనుకూలంగా ఉంటే చాలు..అది నిజమో..కాదో..అబద్ధం చెబుతున్నారేమోనన్న కనీస ఆలోచన రాదు. క్రాస్ చెక్ చేసుకుందామన్న కనీస బుద్ధి పుట్టదు. ఈ ఫేక్న్యూస్లన్ని దాదాపు విద్వేషాన్ని నింపే విధంగానే ఉంటాయి. వాటి కారణంగా అల్లర్లు చెలరేగుతాయి.. రక్తాలు కారుతాయి… కుటుంబాలకు నాశనం అవుతాయి..ఏకంగా ప్రాణాలే పోతాయి. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన మణిపూర్ వివస్త్ర స్త్రీల ఊరేగింపు ఘటనకు కారణం ఫేక్న్యూసేనని తేలింది.
పూర్తిగా చదవండి..











