తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో వేగం పెంచింది. గాంధీ భవన్ మీడియాతో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే వీలైనంత త్వరలో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలపై గ్యారెంటీ కార్డు సైతం అందించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్డును ఇంటింటికీ తిరిగి అందజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు బీసీలను నిలబెట్టాలని చూస్తున్నామన్నారు. సీపీఐ, సీపీఎం పార్టీల పోత్తులపై స్పందించిన ఠాక్రే పొత్తులపై అనాధికారిక చర్చలు జరుగుతున్నాయన్నారు. వామపక్షాలతో చర్చలు ఇంకా ప్రథమిక దశలోనే ఉన్నాయన్నారు. మరోవైపు కాంగ్రెస్లో వైఎస్ షర్మిల చేరికకు సంబంధించిన అంశాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Manik Rao Thackeray: హామీలపై గ్యారెంటీ కార్డు ఇస్తాం
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు

Translate this News:











