Lakshmi Manchu: స్వలింగ సంపర్కుల వివాహాలకు (same-sex marriage) చట్టబద్ధత కల్పించలేమని సుప్రీంకోర్టు ఇటీవల తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తీర్పు పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఇదే అంశంపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో స్పందించారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో తన గుండె పగిలిపోయిందని పోస్ట్ చేసింది.
పూర్తిగా చదవండి..Lakshmi Manchu: సుప్రీం నిర్ణయంతో నా గుండె పగిలిపోయింది
స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు నిర్ణయంతో తన గుండె పగిలిపోయిందని సోషల్ మీడియాలో నటి మంచు లక్ష్మి కామెంట్స్ చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని సుప్రీంకోర్టు చెప్పడం తనకు నిరాశను కలిగించిందని తెలిపింది. మన దేశానికి ఇది అవమానకరమని వ్యాఖ్యనించింది. ఇతర దేశాల్లో ఉన్న స్వలింగ సంపర్కులు స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతున్నారని.. మరి మన దేశంలో వీరి వివాహాలను అంగీకరించలేమా? అంటూ ప్రశ్నించింది మంచు లక్ష్మి.

Translate this News:











