మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ ఆరెపల్లి మోహన్ రేపు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రేపు సాయంత్రం 5 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, జాయినింగ్స్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఆరెపల్లి మోహన్ తోపాటు బీఆర్ఎస్కు చెందిన స్థానిక జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్ల తోపాటు సుమారు 100 మంది ప్రజా ప్రతినిధులు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
పూర్తిగా చదవండి..Arepalli Mohan: బీజేపీలోకి ఆరెపల్లి మోహన్.. ఘనంగా స్వాగత కార్యక్రమాలు
రేపు ఆరెపల్లి మోహన్ బీజేపీలో చేరికకు సర్వం సిద్ధమైయింది. ఆరెపల్లి తోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీలు సహా పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు చేరే అవకాశం ఉంది. ఎల్లుండి ఘనంగా మానకొండూరులో స్వాగత కార్యక్రమాలకు ఆరెపల్లి అనుచరులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ను ఆరెపల్లి మోహన్ కలిశారు.

Translate this News:











