సాధారణంగా ఏదైన ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే కొన్ని రోజులు, వారాలు లేదా కొన్ని నెలలకైనా దానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకోవచ్చు. కానీ ఓ వ్యక్తి ఉద్యోగానికి అప్లై చేసిన 28 ఏళ్లకు ఉద్యోగాన్ని పొందాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే దీని గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదావాల్సిందే.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంకుర్ గుప్తా అనే వ్యక్తి 1995లో తపాలాశాఖలో అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. అంతేకాదు అందులో మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అలాగే ముందస్తు శిక్షణకు కూడా ఎంపికయ్యారు. అయితే ఇక్కడే మరో ట్విస్టు జరిగింది. అతను వృత్తి విద్యా కోర్సులో ఇంటర్మీడియట్ చదివినందు వల్ల ఉద్యోగానికి అనర్హుడంటూ తపాలా శాఖ అధికారులు భావించారు. దీంతో ఎంపికైన అభ్యర్థుల జాబితా నుంచి అంకుర్ గుప్తా పేరును తొలగించారు. దీంతో అతడు షాకయ్యాడు.
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు.. 28 ఏళ్లకు ఆ జాబ్ వచ్చింది..
ఉత్తరప్రదేశ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తికి 28 ఏళ్ల తర్వాత ఆ ఉద్యోగం వచ్చింది. అంకుర్ గుప్తా అనే వ్యక్తి 1995లో తపాలాశాఖలో అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. అతను మెరిట్ జాబితాలో చోటు సంపాదించుకుని ముందస్తు శిక్షణకు కూడా ఎంపికయ్యాడు. కానీ అతని విద్యార్హతల కారణంగా ఉద్యోగానికి అనర్హుడంటూ తపాలాశాఖ అంకుర్‌ను ఎంపికైన అభ్యర్థుల జాబితా నుంచి తొలగించింది. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు రావడంతో దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం అతనికి నెలరోజుల్లో ఉద్యోగాన్ని ఇవ్వాలని తపాలాశాఖకు ఆదేశాలు జారీ చేసింది.

Translate this News:











