మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanmantharao) కాంగ్రెస్ లో చేరిక.. ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ (Nandikati Sreedhar) పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఈరోజు తన అనుచరులతో సమావేశమయ్యారు. మౌలాలి క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు నందికంటి శ్రీధర్ నిర్వహించిన సమావేశానికి దాదాపు వేయి మంది ముఖ్య కార్యకర్తలు హాజరైనట్లు తెలుస్తోంది. పార్టీ తనకు ద్రోహం చేసిందని నందికంటి ఆగ్రహం చేసినట్లు తెలుస్తోంది. తాను తల్లిలా భావించిన కాంగ్రెస్ పార్టీనే తనను మోసం చేసిందని ఆయన కన్నీళ్లు పెట్టకున్నారు. బీసీలకు కాంగ్రెస్లో స్థానం లేదంటూ ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు. రాహుల్ని కలిసినా ఫలితం శూన్యమని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో పార్టీకి రాజీనామా చేద్దామని కార్యకర్తలు నినాదాలు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana BJP: ఈ నెల 6న బీజేపీ అభ్యర్థుల జాబితా.. ఆ స్థానాలకు అభ్యర్థులు ఖరారు?
Telangana Congress: కాంగ్రెస్ లో లొల్లి పెట్టిన మైనంపల్లి చేరిక.. మరో కీలక నేత రాజీనామా?

Translate this News:











