ఇటీవల అమెరికాలోని మైన్ రాష్ట్రంలో లెవిస్టన్లో భీకర కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కాల్పులు చేసిన నిందితుడు రెండు రోజుల తర్వాత శవమై కనిపించాడు. శుక్రవారం రాత్రి అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చివరికి నిందితుడి మృతితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గత బుధవారం రాత్రి లెవిస్టన్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని 40 ఏళ్ల రాబర్ట్ కార్డ్‌గా గుర్తించారు. అతడి వద్ద ఆయుధాలు ఉండటం వల్ల.. మళ్లీ నిందితుడు కాల్పులకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Crime News: 18 మందిని చంపిన ఆ హంతకుడు మృతి.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు
అమెరికాలోని లెవిస్టన్ పట్టణంలో ఇటీవల కాల్పులు జరిపిన నిందితుడు రాబర్ట్ కార్డ్ మృతి చెందాడు. ఓ రీసైక్లింగ్ సెంటర్ దగ్గర్లోని చెట్ల పొదల్లో ఒకరి మృత దేహాన్ని స్థానికులు గుర్తించగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని రాబర్డ్ కార్డ్‌గా గుర్తించారు. బుల్లెట్ గాయంతో అతడు మృతి చెందాడని తెలిపారు. అయితే రాబర్ట్ కార్డ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైనా కాల్చి చంపారా? అన్న విషయాన్ని పోలీసులు ఇంకా తేల్చలేదు.

Translate this News:











