Mahua Moitra: ఇటీవల బీజేపీ ఎంపీ.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు మొయిత్రా డబ్బులు తీసుకున్నారని చెప్పడంతో రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో ముహువా మొయిత్రా ఎక్స్ (Twitter) వేదికగా కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం.. హీరానందాని (Hiranandani)పై ఒత్తిడి తీసుకొచ్చి తెల్లకాగితంపై అందులో సంతకం చేయించిందని పేర్కొన్నారు. ఆ కాగితంలో ఉన్న సమాచారమే ఆ తర్వాత మీడియాకు లీక్ అయినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి ప్రతిష్ఠను దెబ్బతీయడానికే.. గౌతం అదీనీని మహువా లక్ష్యంగా చేసుకున్నారని హిరానందని గ్రూప్ సీఈవో దర్శన్ హీరానందాని గురువారం తెలిపారు. అదానీ సంస్థలపై లోక్‌సభ సమావేశాల్లో ప్రశ్నలు అడిగేందుకు ఆమెకు హీరానందానీ నగదు చెల్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకోసం మొయిత్రా పార్లమెంటరీ లాగిన్‌ను ఉపయోగించుకున్నట్లు హిరానందాని అంగీకరించినట్లు ఓ వార్తా సంస్థ గుర్తించింది.
పూర్తిగా చదవండి..Mahua Moitra: ఒత్తిడి చేసి బలవంతంగా సంతకం చేయించారు.. మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్ సమావేశాల్లో అదానిపై ప్రశ్నలు అడిగేందుకు తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి, ఈ నేపథ్యంలోనే మహువా ఎక్స్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం.. హీరానందానిపై ఒత్తిడి తీసుకొచ్చి తెల్లకాగితంపై అందులో సంతకం చేయించిందని పేర్కొన్నారు. ఆ కాగితంలో ఉన్న సమాచారమే ఆ తర్వాత మీడియాకు లీక్ అయినట్లు పేర్కొన్నారు.

Translate this News:











