mahesh babu son gautam photos viral: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు చేసే సోషల్‌సర్వీస్ వెలకట్టలేనిది. రెయిన్ బో హాస్పిటల్స్, ఆంధ్ర హాస్పిటల్స్ భాగస్వామ్యంతో ఎంబీ ఫౌండేషన్(MB Foundation) అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఎంతోమంది చిన్నారులకు తన ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు చేయించారు మహేశ్‌బాబు. ఎప్పుడు ఎంత చేసినా సైలెంట్‌గానే ఉంటారు. మహేశ్ తనయుడు గౌతమ్‌ని చూసినా అదే ఫీలింగ్ కలుగుతుంది. గౌతమ్ కూడా చాలా సైలెంట్.. మహేశ్ గారాలపట్టి సీతార నెట్టింట్లో అల్లరి చేస్తుంటుంది కానీ.. గౌతమ్ మాత్రం సోషల్‌మీడియాలో ఎక్కువ కనిపించడు.. అయితే ఇటివలే రెయిన్బో ఆస్పత్రిని విజిట్ చేశాడు గౌతమ్. తన ఫౌండేషన్ ద్వారా చికిత్స తీసుకుంటున్న చిన్నారులను పలకరించాడు. ఇది చూసి గౌతమ్ తల్లి నమ్రత ఎంతగానో మురిసిపోయారు.
పూర్తిగా చదవండి..Gautam: అచ్చం తండ్రిలానే.. మహేశ్ తనయుడు గౌతమ్ ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!
తన తనయుడు గౌతమ్‌ని చూసి ఎంతగానో గర్వపడుతున్నానంటున్నారు మహేశ్ బాబు భార్య నమ్రత. గౌతమ్ ఇటివలే రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారులను పలకరించాడు..వారిని నవ్వించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను నమ్రత ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. అవి కాస్త వైరల్‌గా మారాయి. MB ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి గుండె ఆపరేషన్లు చేయించారు మహేశ్‌బాబు.

Translate this News:














