గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ (Sharukh Khan) సినిమా జవాన్ (Jawan) గురించి ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది. పఠాన్(Paatan) సినిమాతో భారీ వసూళ్లను రాబట్టిన షారూక్ ఈ సినిమాతో ఆ రికార్డును తిరగరాయాలనుకుంటున్నాడు. జవాన్ సినిమా విడుదల సందర్భంగా ఇప్పటికే షారూక్ కు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తిగా చదవండి..Jawan Movie: నువ్వెప్పుడూ సినిమాకి వెళ్తే..అప్పుడూ నేను కూడా వస్తా!
బాలీవుడ్ సూపర్ స్టార్..టాలీవుడ్ సూపర్ స్టార్ మధ్య ఓ సరదా సంభాషణ చోటు చేసుకుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)జవాన్ సినిమా కోసం షారూక్ కి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు..కుటుంబ సమేతం గా సినిమాని చూడాలనుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు

Translate this News:











