పఠాన్ జవాన్ సినిమాలతో వసూళ్ళ రికార్డులను బద్దలుకొట్టాడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో బాలీవుడ్ కు హుషారు తీసుకువచ్చాడు. కానీ బాద్షా ప్రాణాలకు ముప్పు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను బెదిరిస్తూ లేఖలను రాయడమే దీనికి కారణం. ఈ లేఖల గురించి షారూఖ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆయనకు భద్రతను పెంచింది. Y ప్లస్ సెక్యూరిటీ కింద షారుక్ కు 11 మందితో భద్రతను ఏర్పాటు చేశారు. వీరిలో ఆరుగురు కమెండోలు కాగా, మిగిలిన నలుగురు రాష్ట్ర వీఐపీ సెక్యూరిటీ వింగ్ కు చెందినవారు.
పూర్తిగా చదవండి..SHARUKH KHAN:షారూఖ్ ఖాన్‌కు బెదిరింపు-భద్రత పెంచిన ప్రభుత్వం
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులు Y+ భద్రతను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్గా గుర్తు తెలియని వ్యక్తులు షారూఖ్‌ను చంపేస్తామంటూ లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Translate this News:











