Mahadev Betting App: మహదేవ బెట్టింగ్ యాప్ ను క్రియేట్ చేసిన సౌరభ్ చంద్రకర్ (Sourabh Chandrakar), రవి ఉప్పల్ (Ravi Uppal) ఇద్దరూ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బిలాయ్ కు చెందిన వారు. యాప్ క్రియేట్ చేయకముందు సౌరభ్ జ్యూస్ షాప్ నిర్వహిస్తూ ఉండేవాడు. రవికి టైర్ షాప్ ఉండేది. వీరిద్దరికీ గ్యాంబ్లింగ్ అంటే చాలా ఇష్టమట. దానికి బానిసలైన తమ వ్యాపారాలను వదిలేసి దుబాయ్ కు వెళ్ళిపోయారు. అక్కడే వీళ్ళ జీవితాలు ఒక ములుపు తీసుకున్నాయి. రెండు, మూడు ఏళ్ళల్లో ఏకంగా 5వేల కోట్లు సంపాదించే రేంజ్ కు తీసుకువెళ్లిపోయింది.
పూర్తిగా చదవండి..MAHADEV BETTING APP:జ్యూస్ షాప్, టైర్ షాప్…మహదేవ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల బ్యాక్ గ్రౌండ్ ఇదీ.
మహదేవ బెట్టింగ్ యాప్....ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తున్న మ్యాటర్. ఈ మనీల్యాండరింగ్ కుంభకోణం కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. దాంతో పాటూ విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ యాప్ ను ప్రమోట్ చేసింది సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ అనే ఇద్దరు బీహార్ యువకులు. అసలు వీళ్ళు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చేవారు? గతంలో ఏం చేశారు అని చూస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Translate this News:












