Mahabubabad:మహబూబాబాద్ జిల్లాలో ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక అటెండర్ స్వరూప సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇనుగుర్తి బాలికల సాంఘిక సంక్షేమ పాఠశాలలో ప్రిన్సిపాల్ తనను వేథింపులకు గురిచేసేదని బాధితురాలు వాపోతోంది. స్వరూప ను ప్రిన్సిపాల్ ఓవర్ డ్యూటీలు చేయించి, వ్యక్తిగత పనులు చేయించుకోవడం, అనారోగ్యాంతో ఉన్నా సెలవులు ఇవ్వకుండా..ఒత్తిడికి గురిచేయడం లాంటి వేధింపులకు పాల్పడుతుండేదని తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.
పూర్తిగా చదవండి..https://www.youtube.com/watch?v=FuYdogiQKvA
దీంతో స్వరూప పరిస్థితి విషమించడంతో పాఠశాల ప్రిన్సిపాల్ సిబ్బంది స్వరూపను గుట్టు చప్పుడు కాకుండా హుటాహుటిన తొర్రూరు పట్టణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తోంది. అయితే, ఈ విషయం బయటకు చెప్పవద్దంటూ ఆమెను భయబ్రాంతులకు గురిచేసిందని బాధితురాలు వాపోతోంది. అటెండర్ ను వేధింపులకు గురి చేసి ఆత్మహత్య యత్నానికి ప్రేరిపించిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని బాధితురాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : కశ్మీర్లో బాంబుల మోత.. ఎలా మోగుతుందో అంటే..?
[vuukle]











