Lokesh Meets Amit Shah: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టైన తరువాత నుంచి ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలోనే మకాం వేశారు. చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అంటూ జాతీయ స్థాయిలో వెలుగెత్తిచాటే ప్రయత్నం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సైతం కలిసి చంద్రబాబు అరెస్ట్‌పై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞాపన పత్రం అందజేశారు. ఇక ప్రభుత్వం పెద్దలను సైతం కలిసేందుకు లోకేష్ గట్టి ప్రయత్నాలే చేశారని టాక్. అయితే, ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. నెల రోజులు హస్తినలోనే పెద్దల పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు రావాల్సిందిగా సీఐడీ అధికారులు లోకేష్‌కు నోటీసులు జారీ చేశారు. దాంతో లోకేష్ అమరావతికి వచ్చాడు. రెండు రోజులు సీఐడీ విచారణను ఎదుర్కొన్నాడు.
పూర్తిగా చదవండి..Lokesh Meets Amit Shah: అమిత్ షాతో లోకేష్ భేటీ.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయాలకు నాంది?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను నారా లోకేష్‌ను కలవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విరి భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పురంధేశ్వరి ఉండటం.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వీరి భేటీ.. ఏపీ, తెలంగాణలో ఎలాంటి రాజకీయ మార్పులకు నాంది పలుకుతుందోనని చర్చ నడుస్తోంది.

Translate this News:











