Cases Against TDP Leaders: గన్నవరం యువగళం సభలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసులు నమోదుచేడయంపై యువనేత నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. “యువగళం సభలో నేను, మా టిడిపి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశామని పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నా తల్లిని అవమానించినవాళ్లు, మరో తల్లిని అవమానించకుండా బుద్ధి చెబుతాననడం రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా అవుతాయో! ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటక పాలకులని ప్రశ్నించే బాధ్యతని ప్రతిపక్ష టీడీపీ నిర్వర్తించడం నేరం ఎలా అవుతుందో అని అడిగారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు (Chandrababu)పై ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ రెడ్డి చేసినవని చెప్పుకొచ్చారు. అపోజిషన్ లీడర్లా కాకుండా ఫ్యాక్షనిస్టులా చంద్రబాబుని కాల్చి చంపండి, ఉరి వేయండి, చెప్పులతో కొట్టండి, చీపుర్లతో తరమండి అని విద్వేషం నింపే ప్రసంగాలు చేశారు” అని లోకేశ్ ట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..Lokesh: టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం
గన్నవరం యువగళం సభలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసులు నమోదుచేడయంపై యువనేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటక పాలకులని ప్రశ్నించే బాధ్యతని ప్రతిపక్ష టీడీపీ నిర్వర్తించడం నేరం ఎలా అవుతుందో అని ప్రశ్నించారు.

Translate this News:











