బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ, బ్రహ్మ శంకర్‌నగర్ బస్తీకి చెందిన విజయ్ కుమార్ అనే యువకుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. అత్యవసరంగా డబ్బులు అవసరం ఉండి ఆన్లైన్ లోన్ యాప్‌ల ద్వారా డబ్బులు తీసుకున్నాడు. అయితే.. విజయ్ కుమార్ డబ్బులు సకాలంలో చెల్లించక పోవటంతో లోన్ యాప్ ఆగడాలు ఎక్కువైయ్యాయి.
పూర్తిగా చదవండి..Loan App: అప్పు తీసుకున్న పాపానికి అశ్లీల ఫొటోలతో.. ఈ లోన్ యాప్ ఏం చేసిందంటే?
లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలైయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని బోరబండలో చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులు తాళలేక విషం తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ వేధింపులతో తమ కొడుకు బలవన్మరణానికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Translate this News:











