ఖమ్మం జిల్లా తిరుమలాయపల్లి (మం) దమ్మాయిగూడెంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న 8 మంది కూలీలపై పిడుగు పడింది. మద్ది వీరయ్య మిర్చి, పత్తిచేనులో కూలీలు పనిచేస్తుండగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో కూలీలు పక్కనే ఉన్న వేప చెట్టు కిందకు చేరారు. ఇంతలోనే భారీ శబ్దంతో పిడుగు ఒక్కసారిగా పడడంతో 8 మంది కూలీలు పిడుగుపాటుకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పరిస్థితి విషమం ఉండగా.. మిగతా వారికి గాయాలు అయినట్లు తెలిసింది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఈ ఇద్దరు మహిళలకు ఎలాంటి ప్రమాదంలేదని, ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం. అయితే..మంగళవారం కురిసిన వర్షానికి పిడుగుపడి సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..Telangana news: తెలంగాణలో పెను విషాదం..8 మందిపై పిడుగుపాటు
తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోన్న విషయం తెలిసింది. భారీ వర్షాల కారణంగా ఏపీ- తెలంగాణలో పలుచోట్ల పిడుగుపాటుకు గురయ్యారు. ఎనిమిది మంది కూలీలు పనుల్లో నిమగ్నమైన ఉండగా పిడుగు పండింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

Translate this News:











