Leopard in Srisailam: శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. శ్రీశైల క్షేత్రం(Srisailam) సమీపంలోని పాలధార-పంచదార వద్ద చిరుతపులి(Leopard) సంచరించింది. పాలధార పంచదార వద్ద ఉన్న రక్షణ గోడపై చిరుత పులి కూర్చొని ఉంది. అయితే, శ్రీశైల క్షేత్రానికి కారులో వెళ్తున్న భక్తులు ఆ చిరుతను గుర్తించారు. అటుగా వెళ్తుండగా.. ఒక్కసారిగా చిరుత కనిపించడంతో తమ కారును ఆపి చిరుతను పరిశీలించారు. అది నిజంగానే చిరుతనా కాదా? అని పరిశీలించారు. కారు లైట్స్ ఆన్ చేసి పరిశీలించగా.. చిరుత క్లియర్గా కనిపించింది. ప్రయాణికులు గట్టిగా అరవడంతో.. చిరుత బెదిరిపోయింది. అరుపులు కేకలు వేయడంతో ఆ చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అయితే, గోడపై విశ్రాంతి తీసుకుంటున్న చిరుతను భక్తులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు.
పూర్తిగా చదవండి..Srisailam: శ్రీశైలంలో చిరుత పులి సంచారం.. భయాందోళనలో భక్తులు..
శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. శ్రీశైల క్షేత్రం సమీపంలోని పాలధార-పంచదార వద్ద చిరుతపులి సంచరించింది. పాలధార పంచదార వద్ద ఉన్న రక్షణ గోడపై చిరుత పులి కూర్చొని ఉంది. అయితే, శ్రీశైల క్షేత్రానికి కారులో వెళ్తున్న భక్తులు ఆ చిరుతను గుర్తించారు.

Translate this News:











