తిరుమల(tirumala) కొండపై ఏర్పాటు చేసిన బోనుకు చిక్కింది చిరుత. ఎట్టకేలకు అర్థరాత్రి చిరుతను బంధించారు అధికారులు. మూడ్రోజుల క్రితం చిన్నారి లక్షితను బలి తీసుకున్న చిరుతను పట్టుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. లక్షిత(Lakshitha)పై దాడి చేసిన ప్రాంతంలో ఏర్పాటుచేసిన బోనులో పడింది చిరుత(chirutha). అయితే లక్షితను చంపింది ఈ చిరుతనేనా కాదా అన్నది తేలాల్సి ఉంది. మొత్తం నాలుగు ప్రాంతాల్లో చిరుతను పట్టుకునేందుకు అధికారులు బోనులు ఏర్పాటు చేయగా. అందులో ఒకదాంట్లో చిరుత చిక్కింది. ఈ చిరుత వయసు 5 సంవత్సరాలు ఉండొచ్చని సమాచారం. అంటే పెద్ద చిరుత అనే అర్థం. కాబట్టి ఇదే లక్షితను చంపేసిందానన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక నెల రోజుల క్రితం బాలుడిపై దాడి చేసిన చిరుత చిన్నదని.. దాని వయసు ఏడాదిన్నర మాత్రమేనని తెలుస్తోంది. అందుకే ఆ బాలుడిని చంపకుండా చిరుత వదిలిపెట్టిందని అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం బోనులో చిక్కిన చిరుత మాత్రం పెద్దదని.. లక్షితని ఇదే చంపేసి ఉండొచ్చని ప్రజలు అనుకుంటున్నారు. అటు రెండ్రోజుల్లో చిరుత 5 ప్రాంతాల్లో సంచరించినట్టు గుర్తించారు అధికారులు.
పూర్తిగా చదవండి..Tirumala chirutha Video : బోనులో చిక్కిన చిరుత.. ఫలించిన అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నాలు!
తిరుమల కాలినడక మార్గంలో అర్థరాత్రి ఓ చిరుత బోనులో చిక్కింది. చిన్నారి లక్షితను చంపేసిన చిరుత అదే కావచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే.. చిన్నారిని చంపేసిన ప్రదేశానికి దగ్గర్లోనే ఈ బోనును ఏర్పాటు చేశారు. అర్థరాత్రి వేళ చిరుత ఆ బోనులోకి వచ్చి చిక్కింది.

Translate this News:











