మరో రెండు రోజుల్లో లారెన్స్, కంగనా నటించిన చంద్రముఖి 2 సినిమా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఒరిజినల్ వేంకటపతి రాజుని వేటయ్యాన్ కలిశాడు. అంటే లారెన్స్ , రజినీకాంత్ ని మీట్ అయ్యాడు. ఈ విషయాన్ని లారెన్స్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రీసెంట్ గా రజినీకాంత్ జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు లారెన్స్ శుభాకాంక్షలు తెలియజేశాడు. దాంతో పాటూ తన చంద్రముఖి మూవీ విడుదలకు రెడీ అవ్వడంతో రజినీకాంత్ దగ్గర ఆశీస్సులు తీసుకున్నానని చెప్పాడు.
పూర్తిగా చదవండి..movies:రజనీ కాళ్ళు మొక్కిన లారెన్స్ రాఘవ
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ లారెన్స్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చంద్రముఖి2. రజినీకాంత్ హీరోగా, దాదాపు 17ఏళ్ళ క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాకి ఇది సీక్వెన్స్ కావడం విశేషం. సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అధికారిక ప్రకటన చేసింది.

Translate this News:











