Foreign Industries to Kamareddy: కామారెడ్డి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (IT Minister KTR) అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా నియోజకవర్గ కేంద్రంలో మంత్రి పర్యటించారు. అక్కడ 28 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆరులైన్ల రహదారులను, సెంట్రల్ లైటింగ్‌ను, రోడ్డు డివైడర్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంపా గోవర్దన్ రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ 45 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 28 కోట్ల రూపాయలతో రోడ్డు డివైడర్లును, స్వాగత తోరణాలను, సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో కామారెడ్డి జిల్లా అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
పూర్తిగా చదవండి..KTR: కామారెడ్డి జిల్లాకు విదేశీ పరిశ్రమలు తీసుకొస్తాం
కామారెడ్డి జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన రహదారులను, సెంట్రల్ లైటింగ్‌ను, రోడ్డు డివైడర్లను ప్రారంభించారు.

Translate this News:











