ఎన్డీఏలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారంటూ గులాబీ సర్కార్‌పై ఆరోపణలు గుప్పించిన ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని.. దేవగౌడ కొడుకు ఎన్డీయేలో చేరినప్పుడు మోదీకి రాజరికం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు కేటీఆర్. జైషా ఎవరు..? అయనకు బీసీసీఐ పదవి ఎలా వచ్చిందని నిలదీశారు. మోదీతో చేరేందుకు మాకేం పిచ్చికుక్క కరవలేదని.. మోదీ చెప్పే అబద్దాలు చిన్నపిల్లలు కూడా నమ్మరన్నారు కేటీఆర్. మేం గుజరాత్ గులామ్‌లం కాదు.. ఢిల్లీకి బానిసలం కాదని ఫైర్ అయ్యారు. మోదీ అబద్దాలకు ఇక్కడ ఎవరూ భయపడరని కౌంటర్ వేశారు కేటీఆర్.
కేటీఆర్ ఇంకేం అన్నారంటే?
KTR VS Modi: ‘మాకేం పిచ్చి కుక్క కరవలేదు’.. ‘దగుల్బాజీ మాటలు, అడ్డమైన చెత్త వాగుడు’..! కేటీఆర్ ఫైర్!
జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చి తనను కలిశారని.. ఎన్డీఏలో చేర్చుకోవాలని అభ్యర్థించారన్న మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. గుండెలు చించుకొని అరిసినంత మాత్రానా అబద్ధాలు నిజం అయిపోవన్నారు కేటీఆర్. మీరు పొత్తు పెట్టుకుంటే రాచరికాలు గుర్తుకురావా అని ప్రశ్నించారు కేటీఆర్. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నప్పుడు లోకేశ్ మంత్రేగా అని నిలదీశారు.

Translate this News:











