తెలంగాణ మంత్రి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ చిన్న విషయం మీద స్పందిస్తూ ఉంటారు. తాజాగా సీడబ్లూసీ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల మీద మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళ కపటకధలు, కంత్రీగోత్రాలు తెలంగాణ గడ్డలో అందరికీ తెలుసునని…కల్లబొల్లి గ్యారెంటీలు ఇక చెల్లవ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలకేయుల కాలం వస్తే కరెంట్ కోతలు…కటిక చీకట్లు గ్యారెంటీ అంటూ విమర్శించారు. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంట కరెంటే గతి అంటూ మండిపడ్డారు. బకాసురులు గద్దెన్నెక్కితే రైతు బీమా…ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ అంటూ ట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..కాంగ్రెస్ ఆరుపథకాల మీద నిప్పులు చెరిగిన కేటీఆర్
టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల మీద ఆయన ట్వీట్ చేశారు. రాబందుల రాజ్యమొస్తే రైతు బంధు రద్దవడం గ్యారెంటీ అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ఆరు పథకాల మీద మండిపడ్డారు.

Translate this News:











