ఈరోజు మొదలైన పార్లమెంట్ ప్రత్యేకపమావేశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని మీద తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మోదీ ఇలా మాట్లాడ్డం మొదటి సారి కాదని కామెంట్ చేశారు. చారిత్రక వాస్తవాల పట్ల ఆనయకున్న నిర్లక్ష్యానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు. మోదీ తెలంగాణ విరోధి అని…పదే పదే తెలంగాణను ఏదో ఒకటి అంటూనే ఉంటారని కేటీఆర్ మండిపడ్డారు. అమృతకాల సమావేశాలు అని పేరు పెట్టి ఇలా విషం చిమ్మడం ఏం సంస్కారమని విమర్శించారు.
పూర్తిగా చదవండి..రాష్ట్ర విభజన మీద ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
ప్రధాని మోదీ ఈరోజు లోక్ సభలో తెలంగాణ విభజన మీద చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మోదీ అలా మాట్లాడతారని అస్సలు ఊహించలేదని...చాలా ఆశ్చర్యం కలిగించాయని కేటీఆర్ అన్నారు. అయినా తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానించడం ఇదేం మొదటిసారి కాదని అన్నారు.

Translate this News:











