ఉయ్యూరులోని కాటూరు రోడ్డులోని ఉన్న శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థలో కేంద్ర అధికారులు తనిఖీలు నిర్వహించారు. విద్యాసంస్థల్లో అక్రమంగా నిషేధిత థాయిలాండ్‌కు చెందిన నత్తల పెంపకాన్ని గుట్టురట్టు చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఘటనపై రాష్ట్ర అధికారులపై కేంద్ర అధికారులు మండిపడ్డారు. దేశంలో నిషేధిత నత్తలను ఏపీలోని ఉయ్యూరులో ఓ వ్యక్తి పెంచడం కలకలం సృష్టిస్తోంది. థాయ్‌లాండ్ నత్తలు చాలా ప్రమాదకరమని, ఒక్కోటి దాదాపు 50 సెంట్ల పొలంలోని పంటను నాశనం చేయగలదని వ్యవసాయ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నత్తలను ఉయ్యూరులోని శ్రీవిశ్వశాంతి విద్యాసంస్థల చైర్మన్ కుమారుడు మాదాల చంద్రశేఖర్ పెంచుతున్నారు.
పూర్తిగా చదవండి..Breaking News: ఉయ్యూరులో థాయిలాండ్‌కు చెందిన నత్తల కలకలం
ఆంధ్రపద్రేశ్లో నిషేధిత నత్తల పెంపకంపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిషేధిత థాయిలాండ్ నత్తల పెంపకానికి సంబంధించి కేంద్ర అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో కలకలం రేపింది. నిషేధిత థాయ్‌లాండ్ నత్తల శ్రీవిశ్వశాంతి విద్యాసంస్థ ప్రాంగణంలో కనిపించాయి.

Translate this News:











