ధర్మం.. నా వైపే ఉంది. ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. తుది శ్వాస వరకు ఇక్కడే ఉంటాను అంటున్నారు కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తానని వనమా ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాల్వంచ, కొత్తగూడెం నియోజకవర్గం జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి అంటున్నారు. వార్డ్ మెంబర్ నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్‌గా ఇక్కడే మున్సిపల్ చైర్మన్‌గా ఎమ్మెల్యేగా, మంత్రిగా కేసీఆర్ నాయకత్వంలో అనేక మంచి కార్యక్రమాలు చేశానని ఆయన అంటున్నారు. ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల అండదండలతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించి కేసీఆర్‌కి కానుకగా ఇవ్వబోతున్నానన్నారు.
పూర్తిగా చదవండి..Vanama Interview: పొంగులేటిని చిత్తు చిత్తుగా ఓడిస్తా.. కొత్తగూడెం నా అడ్డా: ఎమ్మెల్యే వనమా సంచలన ఇంటర్వ్యూ
ఎవరు తనపై పోటీ చేసినా గెలుపు మాత్రం తనదేనని కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ధీమా వ్యక్తం చేశారు. కొత్తగూడెం తన అడ్డా అని అన్నారు. ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ఇక్కడే ప్రజల కోసమే పని చేస్తానన్నారు. ఆర్టీవీకి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Translate this News:











