కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక విషయాలు బయటపెట్టారు. ఆరు హామీలే కాక రైతులు, విద్యార్థుల కోసం మేనిఫెస్టోలో కాంగ్రెస్ రూపొందించిన పలు స్కీమ్ లను ప్రజల ముందుంచారు. బుధవారం ఉదయం నల్గొండ ఎన్ జీ కాలనీలో వాకర్స్ తో కలిసి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈసారి తనను నల్గొండలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తానెప్పుడూ నల్గొండ ప్రజలకు గౌరవం తెచ్చే విధంగానే పనిచేశానని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సాయం చేశానని తెలిపారు. 20 ఏళ్ల కింద అవ్వా తాతలకు రూ.200 పెన్షన్ ఇచ్చామని, ప్రస్తుతం పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని రూ.4000 పెన్షన్ అని ఆరు గ్యారెంటీల్లో ప్రకటించామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి మహిళలకు రూ.2500, మహిళలందరికీ ఉచిత ప్రయాణం, రైతులు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15000, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఇంటర్నెట్.. వంటి అద్భుత పథకాలతో మేనిఫెస్టో తయారు చేశామన్నారు. మేనిఫెస్టో రూపకల్పనలో తాను కూడా భాగస్వామిగా ఉన్నానని తెలిపారు.
పూర్తిగా చదవండి..Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టో బయటపెట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సంచలన ఇంటర్వ్యూ
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక విషయాలు బయటపెట్టారు. ఆరు హామీలే కాక రైతులు, విద్యార్థుల కోసం మేనిఫెస్టోలో కాంగ్రెస్ రూపొందించిన పలు స్కీమ్ లను ప్రజల ముందుంచారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఇంటర్నెట్.. వంటి అద్భుత పథకాలతో మేనిఫెస్టో తయారు చేశామన్నారు. మేనిఫెస్టో రూపకల్పనలో తాను కూడా భాగస్వామిగా ఉన్నానని తెలిపారు.

Translate this News:











