Telangana Elections: గత కొద్ది కాలంగా బీజేపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajgopal Reddy) పార్టీ వీడతారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో .. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానని, మళ్లీ కాంగ్రెస్లో చేరబోతున్నానని ప్రకటించారు. పార్టీ మార్పుపై స్పష్టత ఇస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ లేఖను విడుదల చేశారు. కేసీఆర్ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలనే లక్ష్యంతోనే పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. 27న ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది ఆయన మునుగోడు నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాలరెడ్డి పార్టీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రతిష్ఠాత్మకంగా సాగిన మునుగోడు ఉపఎన్నిక పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా బీజేపీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన బీజేపీని వీడతారని, సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా అందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని ప్రచారమైంది. ఆయన ఆయా ప్రకటనలను ఖండిస్తూ వచ్చారు. మునుగోడు టిక్కెట్ కు హామీ లభించటం వల్లనే ఇప్పుడు రాజగోపాలరెడ్డి పార్టీ మారారని పలువురు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: అందుకే కాంగ్రెస్లోకి పోతున్నా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
ప్రజాభిష్టం మేరకే బీజేపీకి బైబై చెప్పి కాంగ్రెస్లో చేరబోతున్నట్టు రాజగోపాల్రెడ్డి చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మాత్రమే ఉందని ప్రజలు అలానే ఆలోచిస్తున్నారని చెప్పారు. అందుకే వారి ఆలోచనలకు అనుగుణంగానే కాంగ్రెస్లో చేరబోతున్నట్టు ప్రకటించారు.కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే తన ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

Translate this News:











