కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎలాంటి సమయం సందర్భం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. టెండర్ల ద్వారానే గంధమల్ల రిజర్వాయర్ పనులు వచ్చాయని, భూ సేకరణ వల్ల ఆ పనులు ఆలస్యం అయ్యాయని వెల్లడిచారు. ఎలాంటి పదవి వద్దంటున్న కోమటిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటే మంచిదని, అందుకు ఇదే సరైన సమయమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్దంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు గాలి మాటలతో ప్రజలను ఇంకెంత కాలం మభ్యపెడుతారని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Gutta Sukhender Reddy: ఎంపీ వెంకట్‌రెడ్డిపై గుత్తా ఫైర్
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పాలిటిక్స్ పీక్స్ లెవల్‌కు వెళ్లాయి. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్లో అవినీతి ఎక్కువైపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించగా.. ఎంపీ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఇదే మంచి సమయమని గుత్తా ఎద్దేవా చేశారు.

Translate this News:











