మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారడంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే కారణంతోనే ఆ పార్టీలో చేరానని అన్నారు. అయితే ఈ చర్యలు లేకపోవడం వల్లే బీజేపీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. బీజేపీలో నాకు గౌరవం, ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కూడా తాను అనుకున్న లక్ష్యం మాత్రం నెరవలేదని పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్రంలో హంగ్ వస్తే బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు మద్దతు ఇస్తారని.. బీజేపీకి ఓటు వేస్తే.. బీఆర్ఎస్కు ఓటు వేసినట్లేనని అన్నారు. ప్రజలు నేను కాంగ్రెస్‌లోకి రావాలని కోరుకుంటున్నారని అందుకే వచ్చానని క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ను ఓడించడమే తన లక్ష్యమంటూ వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..Telangana: సర్వేలన్నీ నాకే అనుకూలంగా ఉన్నాయి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించడమే తన లక్ష్యమని తెలిపారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Translate this News:











