చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. తనను అర్ధనగ్నంగా నడిపిస్తానడంపై స్పందించిన కొడాలి నాని.. లోకేష్ యువగళం యాత్రకు ప్రజా స్పందన రావడంలేదని బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ స్కూల్‌కు వెళ్లే వయసులో తాను పాదయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. యువగళం పాదయాత్ర పూర్తి అవగానే ప్రజలు లోకేష్‌ని కుప్పంకు తరమికొడుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయ్యే 9 నెలల తర్వాత తండ్రి కొడుకులు వారి ముఖాన్ని ప్రజలకు చూపించలేరన్నారు. లోకేష్ తన మాటలతో అందరినీ భయపెట్టాలని చూస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..kodali nani: యువగళం యాత్రకు స్పందన కరువైంది
నారా లోకేష్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన యువగళం పాదయాత్రకు ప్రజా స్పందన కరువైందని డిప్రేషన్‌లో ఉన్న లోకేష్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఏద్దేవా చేశారు.

Translate this News:











