మెగాస్టార్ చిరంజీవి మోకాలికి ఆపరేషన్ పూర్తి అయింది. కొన్నిరోజులుగా ఢిల్లీలో ఉన్న చిరు.. అపోలో ఆసుపత్రిలో తన మోకాలికి చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోనే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈనెల 20న హైదరాబాద్కు రానున్నారు. ఈ శస్త్రచికిత్సను వైద్య పరిభాసలో ఆర్థ్రోస్కోపిక్ నీ వాషౌట్ అని అంటారు. మోకాలిలో ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఈ శస్త్రచికిత్స ద్వారా ఆర్థోప్లాస్టీ చేసి క్లియర్ చేస్తారు. దీనికి పెద్దగా విశ్రాంతి అవసరం లేదు. వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కొన్నిరోజులుగా చిరంజీవికి మోకాలికి శస్త్ర చికిత్స జరగనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో మెగాస్టార్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ చిన్న సర్జరీ అని స్పష్టత రావడంతో అన్నయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
పూర్తిగా చదవండి..చిరంజీవి మోకాలికి ఆపరేషన్ పూర్తి.. ఈనెల 20న హైదరాబాద్కు రాక
మెగాస్టార్ చిరంజీవి మోకాలికి ఆపరేషన్ పూర్తి అయింది. కొన్నిరోజులుగా ఢిల్లీలో ఉన్న చిరు.. అపోలో ఆసుపత్రిలో తన మోకాలికి చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోనే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈనెల 20న హైదరాబాద్కు రానున్నారు.

Translate this News:











