ఆత్మహత్యయత్నం చేసుకున్న హోంగార్డు రవీందర్‌ను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పరామర్శించారు. కంచన్ బాగ్‌లోని అపోలో ఆస్పత్రికి వెళ్లిన కేంద్ర మంత్రి.. చికిత్స పొందుతున్న రవీందర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రవీందర్ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీందర్ ఆత్మహత్య ఘటనకు పూర్తి బాధ్యత కేసీఆరే వహించాలన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదన్నారు. హోంగార్డులు అవమానాలు ఎదుర్కొని, పై అధికారులు చీదరించుకుంటున్నా భరిస్తూ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జీతం సమయానికి రాకపోవడం, ఇంట్లో సమస్యలు ఎక్కువ కావడంతో ఏం చేయాలో తోచక హోంగార్డులు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారన్నారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: హోంగార్డ్ రవీందర్‌ను పరామర్శించిన కిషన్ రెడ్డి
హోంగార్డు రవీందర్‌ను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హొంగార్డు రవీందర్ ఆత్మహత్యయత్నంకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎంపీ డిమాండ్ చేశారు.

Translate this News:











