కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కాచిగూడ రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్‌ను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ప్రధాని అయ్యాక రైల్వే రంగంలో అత్యాధునిక మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన పేర్కోన్నారు. దేశంలో వందలాది రైల్వే స్టేషన్లు అభివృద్ధి జరుగుతున్నాయన్నారు. ఒకే రోజు తొమ్మిది రైళ్ళను ప్రారంభించిన ఘటన ప్రధాని మోదీ తక్కుతుందన్నారు. రవాణా రంగంలో దేశీయ టెక్నాలజీతో ముందుకుపోతున్నామన్నారు. దేశీయ టెక్నాలిజీతో వందే భారత్ ట్రైన్లను తయారు చేసుకుంటున్నాం ఆయన వివరించారు. తెలంగాణలో ఇప్పటికే రెండు వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి.. ఇది మూడోవది అన్నారు. సంక్రాంతి, ఉగాది పర్వదినాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు వందే భారత్ ట్రైన్లను ఇవ్వడం జరిగిందన్నారు. వినాయక నవరాత్రుల సందర్భంగా మూడోవ ట్రైన్‌ను ప్రారంభిస్తున్ననoదుకు సంతోషంగా ఉందన్నారు. తెలుగు ప్రజల తరుపున ప్రధాని మోదీకి, రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి తొమ్మిది లక్షల కోట్లు: కిషన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ ప్రభుత్వం తొమ్మిది లక్షల కోట్లను తొమ్మిదేళ్ళ కాలంలో ప్రకటించింది. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మోదీ ప్రభుత్వం అంకితభావంతో ముందుకు వెళ్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Translate this News:











