రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దీక్షా శిబిరం వద్ద పోలీసులు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం దీక్షా స్థలికి చేరుకున్న బీజేపీ శ్రేణులపై, రైతులపై పోలీసులు ఎందుకు లాఠీఛార్జి చేశారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం బీజేపీ నాయకురాలు డీకే అరుణ మహేశ్వర్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. మహిళ అని చూడకుండా అరుణను పోలీసులు ఈడ్చికెళ్లి అరెస్ట్ చేశారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిర్మల్ జిల్లా రైతులను ఆగం చేయాలని చూస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: ప్రభుత్వ అవినీతి గురించి ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారు
ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మహిళా నాయకురాలిని పోలీసులు ఈడ్చుకెళ్లడం ఎంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం కొనసాగుతోందని మండిపడ్డారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా మహేశ్వర్ రెడ్డి గత వారం రోజులుగా ఆమరణ నిరాహర దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.

Translate this News:











