Kishan reddy injured: తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి(kishan reddy)కి గాయాలయ్యాయి. నిరుద్యోగుల కోసం హైదరాబాద్ ఇందిరా పార్క్(indira park) వద్ద బీజేపీ అగ్రనేతలు చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం ఆరు గంటల వరుకే దీక్షకు పర్మిషన్ ఉందని పోలీసులు చెప్పగా.. రేపు(సెప్టెంబర్ 14) ఉదయం వరకు నిరసన కొనసాగిస్తామని కిషన్‌రెడ్డి బదులిచ్చారు. పోలీసులు మాత్రం రూల్ ఈజ్ రూల్ అని దీక్ష కంటీన్యూ చేసేందుకు నిరాకరించారు. పోలీసులు దీక్షాస్థలికి చేరుకోగానే బీజేపీ కార్యకర్తలు కిషన్‌రెడ్డిని చుట్టుముట్టారు. ఎంతసేపటికి దీక్ష విరమించేందుకు కిషన్‌రెడ్డి టీమ్ అంగీకరించకపోవడంతో ఆయన్ను బలవంతంగా అక్కడ నుంచి పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆయనకు గాయాలయ్యాయి.
ఛాతీపై గాయం:
దీక్షాస్థలి నుంచి పోలీసులు బలవంతంగా తరలించడంతో కిషన్ రెడ్డికి ఛాతీలో గాయమవడంతో పాటుగా.. చేతులపై, ఒంటిపై అక్కడక్కడ గోర్లు గీరుకుపోయాయి. పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డిని పరిశీలించిన వైద్యులు గోర్లు గీరుకుపోయిన చోట్ల ఆయింట్మెంట్ ఇవ్వడంతో పాటుగా.. ఛాతీలో అయిన గాయానికి రేపు(సెప్టెంబర్ 14) ఉదయం ఎక్స్‌రే తీసుకోవాలని సూచించారు. ఇతర పారామీటర్లు బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Kishan reddy: కిషన్ రెడ్డి ఛాతీకి గాయం.. శరీరంపై గీరుకుపోయిన గోర్లు!
బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుద్యోగుల సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఒక్క రోజు నిరాహార దీక్షకు దిగిన బీజేపీ అగ్రనేతలతో పోలీసులకు వాగ్వాదం జరిగింది. దీక్షకు 6గంటల వరుకే పర్మిషన్ ఉందన్న పోలీసులు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని బలవంతంగా దీక్షాస్థలి నుంచి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన ఛాతీకి గాయమైందని.. ఎక్స్‌రే తీయించుకోవాలని వైద్యులు సూచించినట్టు సమాచారం.

Translate this News:











