ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన వ్యవహారం మరింత వేడెక్కుతోంది. కెనడా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను తొలగించేసింది. భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరిస్తున్నట్లు ప్రముఖ వార్త సంస్థ వెల్లడించింది. ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్యలో భారత్ హస్తం ఉండొచ్చన్న ఆరోపణుల చేసింది కెనడా. కెనడా ప్రభుత్వం సోమవారం ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించినట్లు విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తెలిపారు.
పూర్తిగా చదవండి..khalistan : భారత ప్రభుత్వానికి కెనడా పీఎం ఝలక్..దౌత్యవేత్త బహిష్కరణ..!!
ఖలిస్థానీ ఉగ్రవాది , మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో భారత్కు కెనడా గట్టి ఝలక్ ఇచ్చింది. హర్దీప్ సింగ్ నిజ్జార్ కు ఉన్న సంబంధాన్ని తాము విచారిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. కాగా హర్దీప్ సింగ్ ను కెనడాలో కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజ్జార్ పై ఇప్పటికే ఎన్ఐఏ కేసులు కూడా నమోదు చేసింది. అయితే హర్దీప్ సింగ్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

Translate this News:











