టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ (Rekha Naik) మంత్రి కేటీఆర్ పై (Minister KTR) సంచలన వాఖ్యలు చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధికి కేటీఆర్ అడ్డుపడ్డారంటూ ధ్వజమెత్తారు. ఎస్టీ నియోజకవర్గం అభివృద్ధి చెందకుండా స్థానిక మంత్రి కూడా అడ్డుపడ్డారని ఆరోపించారు. చివరకు నా అల్లుడిని కూడా వేధించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలతో నా అల్లుడికి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం చెప్పినట్లు బానిసలా పని చేశానన్నారు.
ఇది కూడా చదవండి: Raja Singh: రూ.500 కోట్లు ఖర్చు చేసినా నేనే గెలుస్తా: సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత రాజాసింగ్ సంచలన ఇంటర్వ్యూ
Rekha Naik నేను భయపడి బతికే రకం కాదు.. జాన్సన్ ఎట్ల గెలుస్తడో చూస్తా: రేఖా నాయక్ ఫైరింగ్ ఇంటర్వ్యూ
తాను భయపడి బతికే రకం కాదన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే రాఖానాయక్. బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ ఎలా గెలుస్తాడో చూస్తానన్నారు. అవకాశం ఇస్తే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానన్నారు.

Translate this News:











