Khammam District Bride Incident : ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లింట సందడిగా కనిపించాల్సిన పెళ్లి కూతురు మృతి చెందడంతో విషాదం అలుముకుంది. జాస్తిపల్లిలో గ్రామానికి చెందిన తిరుపతిరావు, మాధవిల కూతురు దురిశెట్టి భార్గవికి మూడు నెలల క్రితం ఖమ్మం రూరల్ మండలం తనకంపాడు గ్రామానికి చెందిన మహేష్ తో పెళ్లి కుదిరింది. 2023, అక్టోబర్ 26వ తేదీన వీరిద్దరికి పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. పెళ్లికి మూడు రోజులే ఉండడంతో ఇరు కుటుంబాలు అన్ని ఏర్పాట్లు చేశారు. బంధుమిత్రులకు శుభలేఖలు కూడా పంచేశారు. ఇంతలోనే విషాదం అలుముకుంది.
పూర్తిగా చదవండి..
అకస్మాత్తుగా భార్గవి తీవ్ర అనారోగ్యానికి గురైంది. జ్వరం, కడుపునొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరింది పెళ్లి కూతురు భార్గవి. అపెండిక్స్ సమస్యతో బాధపడడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్గవి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. గత కొన్ని నెలలు క్రితం భార్గవి చెల్లెలు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. తిరుపతిరావు మాధవిలకు ఇద్దరు ఆడపిల్లలు. ఈ ఇద్దరు కూడా మృతి చెందడంతో వారు అనాధలుగా మిగిలారు.
Also Read: ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం..నిందితుడికి బెయిల్..!!
భార్గవి మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు తిరుమలరావు, మాధవి. భార్గవి పెళ్లి ఘనంగా చేయాలని భావించిన తల్లిదండ్రులు.. కూతురి మృతితో శోకసంద్రంలో మునిగారు. దుఖంలో ఉన్న భార్గవి తల్లిదండ్రులను అంత్యక్రియల్లో పాల్గొని ఓదార్చి వారికి అండగా నిలిచాడు పెళ్లి కొడుకు మహేష్.
[vuukle]












