తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో అలిపిరి నడక మార్గంలో భక్తుల సౌకర్యార్దం నరసింహ స్వామి ఆలయం నుంచి మోకాలి మిట్ట వరకు షేడ్లు ఏర్పాటు చేస్తామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీంతో పాటు పీఏసీలో 2.5 కోట్ల రూపాయలతో మరమత్తులు చేపడుతున్నట్లు వెల్లడించారు. 24 కోట్ల రూపాయలతో సెకండ్ ఘాట్ రోడ్డులో బ్యారియర్లు ఏర్పాటు చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అంతే కాకుండా 4.5 కోట్ల వ్యయంతో నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునికరణ చేయనున్నట్లు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Translate this News:











