నేను రాజీనామా చేస్తే కానీ ముఖ్యమంత్రికి మునుగోడు గుర్తు రాలేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయిన రాజగోపాల్ రెడ్డి.. తాను రాజీనామా చేస్తేనే కేసీఆర్‌కు గట్టుప్పల్ మండలాన్ని అభివృద్ధి చేయాలనే సోయి వచ్చిందని మండిపడ్డారు. మునుగోడులో బైపోల్స్ జరిగిన ఏడాది తర్వాత ఎన్నికలు వస్తుండటంతో కేసీఆర్ చండూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారన్నారు. కేసీఆర్ చేసే ప్రతీ పని రాజకీయ లబ్ది కోసమే చేస్తున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే కేసీఆర్ చండూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారన్నారు.
పూర్తిగా చదవండి..నా రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి చెందింది: రాజగోపాల్ రెడ్డి
సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి చెందిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ డబ్బులు పంచి తన అభ్యర్థిని గెలిపించుకున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

Translate this News:











