రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ పిలుపు మేరకు జోగులాంబ గద్వాలా జిల్లా కేంద్రంలో బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న డీకే అరుణ అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ గత 10 ఏళ్ల నుంచి తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని జరపడం లేదన్నారు. మరోవైపు తెలంగాణ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ముద్రించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చడం ద్వారా రాబోయే తరాల వారికి తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన పొరాటాలు, తొలిదశ, మళిదశ ఉద్యమాల గురించి తెలుసుకునే అవకాశం ఉందన్నారు.
పూర్తిగా చదవండి..DK Aruna: సెప్టెంబర్ 17న కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.

Translate this News:











