సూర్యాపేట నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం కేసీఆర్. రానున్న ఎన్నికల్లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తే మోసపోవద్దని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కేసీఆర్. అభివృద్ధిలో తెలంగాణనే నెంబర్ వన్ అన్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకో మెడికల్ కాలేజ్ ఇస్తున్నామని చెప్పారు. తలసరి ఆదాయంలోనూ మనమే నెంబర్ వన్లో ఉన్నామని.. సూర్యాపేటలో అద్భుతమైన కళాభారతిని నిర్మిస్తామని హామి ఇచ్చారు కేసీఆర్. సీఎం నిధి నుంచి గ్రామ పంచాయతీలకు పది లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. 25 కోట్లతో సూర్యాపేటకు కళాభారతి.. మిగతా నాలుగు మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా సూర్యాపేట మున్సిపాలిటీకి 50 కోట్లు ఇస్తున్నామన్నారు. సూర్యాపేటలో గ్రౌండ్ కోసం రేపే(ఆగస్టు 20) జీవో విడుదల చేస్తామన్నారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ మంజూరు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు కేసీఆర్.
సూర్యాపేట నుంచే కేసీఆర్ ఎన్నికల శంఖారావం.. గతంలో కంటే ఇంకా ఐదు, ఆరు సీట్లు ఎక్కువే గెలుస్తాం
సూర్యాపేట నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం కేసీఆర్. ఇచ్చిన మాట తప్పలేదు.. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. సూర్యాపేట మున్సిపాలిటీకి 50 కోట్లు ఇస్తున్నామన్నారు. సూర్యాపేటలో గ్రౌండ్ కోసం రేపే(ఆగస్టు 20) జీవో విడుదల చేస్తామన్నారు. విపక్షాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తే మోసపోవద్దని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కేసీఆర్. ఇక పింఛన్లు తప్పకుండా పెంచుతామని స్పష్టం చేశారు.

Translate this News:











